నిష్పక్షపాతంగా కేసుల దర్యాప్తు
కెరమెరి(ఆసిఫాబాద్): నిష్పక్షపాతంగా కేసులు దర్యాప్తు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీసుశాఖ మంజూరు చేసిన కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల వివరాలను ఎస్సై గుంపుల విజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ కరుణాకర్, వాంకిడి సీఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు మిషన్లు
జైనూర్(ఆసిఫాబాద్): మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా చేతన్ ఆర్గానిక్ సంస్థ సహకారంతో మంగళవారం మండల కేంద్రంలో 35 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలన్నారు. యువత మద్యం, గంజాయి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, సీఐ రమేశ్, ఎస్సై రామారావు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment