సెమీ ఫైనల్‌లో ఓడిన జిల్లా జట్టు
మంచిర్యాలటౌన్: హైదరాబాద్‌లో అండర్–14 విభాగంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు సోమవారం జరిగిన సెమీ ఫైనల్‌లో ఓటమి చెందినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. సెమీఫైనల్‌లో సెయింట్ ఆండ్రోస్‌తో తలపడగా ఆ జట్టు 164 స్కోర్ సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు 125 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమి చెందిందని ఆయన పేర్కొన్నారు.
బాలిక అనుమానాస్పద మృతి
ఉట్నూర్‌రూరల్: మండలంలోని గంగాపూర్‌లో అనుమానాస్పదంగా బాలిక మృతి చెందినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. గ్రామానికి చెందిన సీలం ఎల్ల న్న, అంకవ్వ దంపతుల చిన్నకూతురు హరిత (12) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతోంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లకుండా చేనుకు కాపలాగా వెళ్లింది. ఇదే తరుణంలో కిందపడి పోయి మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పత్తి ధరను తగ్గించిన సీసీఐ
బోథ్: బోథ్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో సీసీఐ పత్తి ధరను తగ్గించింది. ఇది వరకు క్వింటాలుకు మద్దతు ధర రూ.7,521 ఉండగా రూ.7,471కి తగ్గించారు. బీబీ స్పెషల్ మోడ్ రకం పత్తి వస్తోందని, అందుకే పత్తి ధరను తగ్గితస్తున్నట్లు సీసీఐ అధికారులు పేర్కొన్నారని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి విఠల్ తెలిపారు.
ముందస్తు క్రిస్మస్ వేడుకలు
రామకృష్ణాపూర్: పట్టణంలోని సీఎస్‌ఐ సెయింట్ పీటర్స్ చర్చిలో సోమవారం రాత్రి ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక గీతాలాపనలు అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, కరుణ, దయాగుణం కలిగిన ఏసుక్రీస్తు బోధనలు అందరూ అనుసరించాలన్నారు. కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ జంగం కళ, కాంగ్రెస్ నాయకులు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, పల్లె రాజు, సీఎస్‌ఐ పాస్టర్ జాషువా, సెక్రెటరీ డొల్కల డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment