చపాతీ కర్రీలో స్టీల్ స్క్రబ్బర్ ముక్క
● మంచిర్యాలలోని ఓ హోటల్‌లో ఘటన
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఓ హోటల్‌లో ఈ నెల 22న రాత్రి ఓ వినియోగదారుడు టిఫిన్ చేసేందుకు వెళ్లి చపాతీ ఆర్డర్ చేశాడు. చపాతీతో పాటు హోటల్ సర్వర్ తీసుకొచ్చిన కర్రీలో స్క్రబ్బర్ ముక్క కనిపించడంతో నిర్వాహకులను నిలదీశాడు. అది స్టీల్ స్క్రబ్బర్ ముక్క అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ హోటల్‌లో వరుస ఆహార కల్తీ పదార్థాలు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఓ వినియోగదారుడు ఉప్మా పార్సిల్ ఆర్డర్ చేశాడు. ఇంటికి వెళ్లి చూసేసరికి అందులో చనిపోయిన ఎలుక లభించింది. గతంలో వెజ్ బిర్యాణిలో బొద్దింక లభించిన ఘటనలూ ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతీ హోటల్‌లో సంబంధిత శాఖ అధికారుల ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయల్సి ఉండగా నిర్వాహకులు తుంగలో తొక్కేస్తున్నారు. ఈ విషయమై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వాసు, హోటల్ యజమానిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించక పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment