![లక్ష రూపాయల బహుమతి వాల్‌పోస్టర్‌ను
ఆవిష్కరిస్తున్న డీఈవో తాహెరాసుల్తానా - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/28/27mcpm06-310106_mr_1.jpg.webp?itok=DWLf_MWo)
లక్ష రూపాయల బహుమతి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీఈవో తాహెరాసుల్తానా
మచిలీపట్నంటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలో పదికి 10 పాయింట్లు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు లక్ష రూపాయల బహుమతి అందించే కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు చెందిన ఆలివ్ స్వీట్స్ అధినేత వి.దొరరాజు తిరిగి ప్రారంభించటం అభినందనీయమని డీఈవో తాహెరా సుల్తానా అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం స్థానిక హిందూ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో 10 పాయింట్లు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ఎనిమిది సంవత్సరాలుగా ఈ పారితోషకాన్ని అందిస్తున్నారన్నారు. కోవిడ్ కారణంగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభించటం అభినందనీయమన్నారు. మచిలీపట్నంలో పదో తరగతి చదివే విద్యార్థులు పది పాయింట్లను సాధించి లక్ష రూపాయలను పొందాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీవైఈవో యువీ సుబ్బారావు, బందరు కోట మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు టీవీ రఘుకాంత్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment