లోకేష్‌ ఉపాధ్యాయులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ ఉపాధ్యాయులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

Published Wed, Aug 28 2024 2:30 AM | Last Updated on Wed, Aug 28 2024 2:30 AM

-

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): మంత్రి నారా లోకేష్‌ ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.సుందరయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీఈవోను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల ఫొటోలు తీసే బాధ్యత నుంచి ఉపాధ్యాయులను పూర్తిగా మినహాయిస్తామని మంత్రి లోకేష్‌ ఎన్నికల సమయంలో హమీ ఇచ్చారన్నారు. మరుగుదొడ్ల ఫొటోలు సచివాలయ ఉద్యోగులు, విద్యా కమిటీ వారి చేత తీయించే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వాటితో పాటుగా ప్రతి రోజూ గూగుల్‌ ఫామ్‌ పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారని తెలిపారు. అటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని డీఈవోను కోరారు. గతంలో ప్రతి రోజూ ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు మరుగుదొడ్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉందన్నారు. దీనిపై నారా లోకేష్‌ ఆ బాధ్యతలను తప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ సచివాలయం ఉద్యోగులు రెండు రోజులు, విద్యాకమిటీ మరో రెండు రోజులు ఫొటోలు తీయాలని, వాటిని ప్రధానోపాధ్యాయులు అప్‌లోడ్‌ చేయాలని అలాగే గూగుల్‌ ఫామ్‌లో నమోదు చేయాలని కొత్తగా ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇటువంటి అన్ని బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను తప్పించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్‌కుమార్‌, జిల్లా కోశాధికారి పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement