12 మంది కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

12 మంది కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల తొలగింపు

Published Wed, Aug 28 2024 2:34 AM | Last Updated on Wed, Aug 28 2024 2:34 AM

-

మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నంలోని సర్వజన ఆస్పత్రిలో పని చేస్తున్న 12 మంది కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులను విధుల నుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ రాజమండ్రి రీజినల్‌ డైరెక్టర్‌ పద్మశశిధర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సర్వజన ఆస్పత్రిలో పని చేసేందుకు 2023 నవంబర్‌ నుంచి 12 మంది స్టాఫ్‌ నర్సులను ఆర్‌డీ కాంట్రాక్టు పద్ధతిన ఎంపిక చేశారు. అప్పటి నుంచి వీరు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అప్పట్లో కోవిడ్‌లో పలు ఆస్పత్రుల్లో సేవలందించామని నకిలీ అనుభవ ధ్రువపత్రాలను సృష్టించి దరఖాస్తు చేసుకున్నారు. గత తొమ్మిది నెలలుగా వీరంతా సర్వజన ఆస్పత్రిలో పని చేస్తున్నారు. వీరిపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేసి వారి నకిలీ అనుభవ ధ్రువపత్రాల వ్యవహారాన్ని గమనించిన ఆర్డీ వీరందరినీ విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. విధుల నుంచి తొలగింపుతోనే సరిపెడతారా వీరిపై ఏమైనా క్రిమినల్‌ కేసులు పెడతారా అనేది వేచి చూడాల్సిఉంది. కోవిడ్‌ సమయంలో పని చేశామని తప్పుడు అనుభవ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి స్టాఫ్‌నర్సుల ఉద్యోగాలు పొందిన 12 మందిలో కిరణ్మయి, దుర్గ, ఝాన్సీరాణి, లావణ్య, ఉమ, మీనా, ప్రశాంతి, మారెమ్మ, లక్ష్మీతిరుపతమ్మ, అనూష, సుమలత, శివనాగేశ్వరరావు ఉన్నారు.

నకిలీ అనుభవ ధ్రువపత్రాలతో

9 నెలలుగా ఉద్యోగాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement