నగరోత్సవం.. నయనానందకరం
దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కనుల పండువగా సాగింది.మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకీపై కొలువుదీరిన ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో కేఎస్ రామరావు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ దేవతా మూర్తుల వద్ద కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృందాల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. మహా మండపం, కనకదుర్గనగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, ఘాట్‌రోడ్డు మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. మహా మండపం ఎదుట ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment