రూ.128 కోట్లతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లు
నేడు పెడన సబ్‌స్టేషన్‌ను వర్చువల్‌లో ప్రారంభించనున్న సీఎం
పెడన: కృష్ణాజిల్లా వ్యాప్తంగా రూ.128 కోట్లతో మూడు సబ్‌స్టేషన్లు నిర్మాణం జరుగుతున్నా యని, వీటిలో పెడన సబ్‌స్టేషన్ స్విచింగ్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వర్చువల్‌గా ప్రారంభించ నున్నారని ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ భాగ్యరాజ్ అన్నారు. బుధవారం సాయంత్రం పెడన తోటమూల సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద ఆయన విద్యుత్ శాఖాధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పెడన, గన్నవరం విమానాశ్రయం, బంటుమిల్లి మండలాల్లో 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఒక్కో సబ్ స్టేషన్‌కు రూ.48 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. వీటి నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఆయా మండలాల్లో లో వోల్టేజ్ సమస్యను అధిగమించడమే కాకుండా వాడుకున్నంత వారికి వాడుకున్నంత ఎక్కువగా విద్యుత్ వినియోగించుకోవచ్చునన్నారు.
కూడూరులో 132/33కేవీ సబ్‌స్టేషన్
పెడన మండలం కూడూరు వద్ద ప్రస్తుతం 132/33కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నారని, భవిష్యత్తులో దీనిని 220/33కేవీగా అప్‌గ్రేడ్ చేస్తారని భాగ్యరాజ్ వెల్లడించారు. ఆ తర్వాత పెడన కేంద్రంగానే అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం అమరావతిలో వర్చువల్ ద్వారా ప్రారంభిస్తా రని, పెడనలో జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈలు ఎం.సత్యానందం, సత్యనారాయణ, మచిలీపట్నం ఈఈ జీవీ శ్రీనివాసరావు, పెడన ఏడీఈ సీహెచ్ మాణిక్యాలరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment