చోరీ కేసులో నిందితులకు జైలుశిక్ష, జరిమానా | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితులకు జైలుశిక్ష, జరిమానా

Published Wed, Aug 28 2024 2:30 AM | Last Updated on Wed, Aug 28 2024 2:30 AM

-

గన్నవరం: చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులకు ఏడాది జైలుశిక్ష, రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ గన్నవరం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమాచారం మేరకు.. ఈ ఏడాది మార్చి 7వ తేదీ రాత్రి గన్నవరం హెచ్‌సీఎల్‌ ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్‌లో నాలుగు సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. అదే రోజు దావాజిగూడెం రోడ్డులోని మోడల్‌ డెయిరీలో రూ.9,500 నగదు చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన విజయవాడలోని కృష్ణలంకకు చెందిన మహంకాళి చందు, షేక్‌ బాషాను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌ చేశారు. అనంతరం స్థానిక 8వ అడిషినల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. గన్నవరం సబ్‌ డివిజన్‌ డీఎస్పీ, సీఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేయగా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వి.ప్రసన్న వాదనలు వినిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement