గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలను తప్పనిసరిగా నమోదు చేయించాలని బాలల సంక్షేమ శాఖ అదనపు జిల్లా పర్యవేక్షణ అధికారి టి.జ్యోతి మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు నిర్దేశించిన దరఖాస్తులతోపాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జత చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీలోగా సంచాలకులు, బాలల సంక్షేమ, సంస్కరణ సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ విజయవాడ కార్యాలయానికి దరఖాస్తులు సమ ర్పించాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, చిరునామా, అర్హతలు, జతపరచాల్సిన డాక్యుమెంట్ల చెక్ లిస్టు ఇతర వివరాలను www. wdcw.ap.gov.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు. దరఖాస్తులను స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా మాత్రమే పంపాలని స్పష్టంచేశారు. ఇతర వివరాలు, సందేహాలకు అదనపు జిల్లా బాలల సంరక్షణ ప్రత్యేక అధికారి టి.జ్యోతి (77803 99779), జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేశ్వరరావు (99480 57383)ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment