పక్కా ప్రణాళిక
పంచాయతీల అభివృద్ధికి
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రణాళికలను పక్కాగా రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం పంచా యతీ అభివృద్ధి ప్రణాళిక తయారీపై పంచా యతీ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత కలెక్టర్ మహాత్మాగాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో పారిశుద్ధ్యం, వీధిదీపాలు, తాగునీటి సరఫరా తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఏవేవి అవసరం ఉన్నాయో వాటికి సంబంధించి ముసాయిదా అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించి ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు. ప్రతి కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అవగాహన పెంపొందించుకుని ప్రణాళికలు తయారుచేయాలన్నారు. ఇందులో సర్పంచులు, వార్డు సభ్యులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్‌కుమార్, విజయవాడ ఎస్‌ఈఆర్‌డీ సంయుక్త సంచాలకులు శ్రీదేవి, పలువురు శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment