టెన్నికాయిట్ జిల్లా జట్ల ఎంపిక
గూడూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా టెన్నికాయిట్ అండర్–14, 17 బాలుర, బాలికల జట్ల ఎంపిక మంగళవారం గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 150 మంది క్రీడాకారులు సెలక్షన్స్‌లో పాల్గొని తమ ప్రతిభను చూపారు. జూనియర్ బాలికల, జూనియర్ బాలుర, సీనియర్ బాలికల, సీనియర్ బాలుర విభాగాల్లో జిల్లా జట్లకు క్రీడాకారులను ఎంపిక చేశారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మజాకుమారి ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్‌లో నియోజకవర్గ స్పోర్ట్స్ ఇన్ చార్జి చింతా మురళీకృష్ణ, మండల స్పోర్ట్స్ ఇన్‌చార్జి మత్తి అరుణ, పీఈటీలు పాల్గొన్నారు.
‘కౌశల్’ పోస్టర్ ఆవిష్కరణ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సంయుక్తంగా నిర్వహించే కౌశల్ –2024 పోటీలకు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధి కారి యు.వి.సుబ్బారావు సూచించారు. కౌశల్ –2024 పోటీల పోస్టర్‌ను ఆయన తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ పోటీలకు ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. క్విజ్, డ్రాయింగ్ వంటి పోటీలు ఆయా తరగతుల వారీగా ఉంటాయని వివరించారు. పాఠశాల, జిల్లాస్థాయి పోటీలు ఆన్‌లైన్‌లో జరుగుతాయని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పేర్లు నమోదు చేసుకునేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్ర మంలో జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్, కౌశల్ కోఆర్డినేటర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ల
నూతన కార్యవర్గం
మచిలీపట్నంటౌన్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల సంఘ సమావేశం మంగళవారం మచిలీపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి పర్యవేక్షణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వి.చినబాబు, ప్రధాన కార్యదర్శిగా ఆర్.ప్రభాకర్, కోశాధికారిగా ఓ. గోపీకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా జి.వి.వి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టి.సురేష్‌బాబు, మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.శివకుమారి, ఉపాధ్యక్షులుగా షంషీదన్, డి.రవిరాజ్, ఎం.ఎన్.కోటేశ్వరరావు, పి.అనితాలీల, జాయింట్ సెక్రటరీలుగా పి.శివ, వి.నాగపుష్ప, వి.రామలక్ష్మి, డి.టి.చరణ్‌సింగ్, మరికొంత మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.
‘స్కై మీట్స్ సీ’ బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన భవానీపురం పున్నమిఘాట్‌లో నిర్వహించనున్న ‘స్కై మీట్స్ సీ’ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మంగళవారం పరిశీలించారు. విజయవాడ – శ్రీశైలం మధ్య ప్రయోగాత్మకంగా స్కై మీట్స్ సీ పేరుతో చేపట్టనున్న సీ ప్లేన్ సర్వీస్ డెమో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు పున్నమిఘాట్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను అధికారులతో కలిసి సీపీ పరిశీలించారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డీసీపీలు గౌతమిశాలిని, కృష్ణమూర్తి నాయుడు, ఏడీసీపీ జి.రామకృష్ణ, పలువురు ఏసీపీలు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment