అమరుల త్యాగాలు అజరామరం
కోనేరుసెంటర్: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి మచిలీపట్నంలో జిల్లా పోలీసులు అమరవీరులను స్మరిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లోని పోలీసు అమరవీరుల స్థూపం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్‌రావు పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పోరాడి అశువులుబాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాంటి త్యాగనిరతులకు పోలీసుశాఖ తరపున నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐలు సతీష్, రవికిరణ్, రాఘవయ్య, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంలో పోలీసుల క్యాండిల్ ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment