సంఘటిత ఉద్యమాలతో సమస్యల పరిష్కారం
మచిలీపట్నంటౌన్: సంఘటిత ఉద్యమాలతోనే బలహీనవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా బీసీల సమస్యల పరిష్కారానికి ఉద్యమించడమే ఏకైక మార్గమన్నారు. బీసీ ఉద్యోగుల పదోన్నతులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కుక్కల వీరవెంకట సత్యనారాయణను నియమించారు. నియామక పత్రాన్ని సమావేశంలో సత్యనారాయణకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment