నవహారతులతో మురిసిన రామలింగేశ్వరుడు
నాగాయలంక: స్థానిక కృష్ణానది తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం వద్ద రామలింగేశ్వరస్వామి మండపంలో రెండోరోజు ఆదివారం రాత్రి నవ హారతుల కార్తిక జ్యోతులు అంబా సాయి కిరణ్ శర్మ బ్రహ్మత్వంలో వైభవంగా జరిగాయి. తొలుత శివలింగానికి ఉభయదాతలు ప్రత్యేక పూజలు చేశారు. అరటి, ఓంకారం, చెట్టు, ఆకృతుల్లో రూపొందించిన స్టాండ్లకు భక్తులు ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. కార్యక్రమాన్ని క్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, కార్య నిర్వాహకుడు తలశిల రఘుశేఖర్, ఉప్పల లీలాకృష్ణప్రసాద్, బోయపాటి రాము తదితరులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment