ఉద్యోగుల పనిష్మెంట్‌పై 70, 71 జీఓలను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పనిష్మెంట్‌పై 70, 71 జీఓలను రద్దు చేయాలి

Published Wed, Nov 20 2024 2:05 AM | Last Updated on Wed, Nov 20 2024 2:05 AM

ఉద్యోగుల పనిష్మెంట్‌పై  70, 71 జీఓలను రద్దు చేయాలి

ఉద్యోగుల పనిష్మెంట్‌పై 70, 71 జీఓలను రద్దు చేయాలి

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆర్టీసీ ఉద్యోగుల పనిష్మెంట్‌పై 70, 71 జీఓలను రద్దు చేయాలని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేతలు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీ శేషగిరిరావు, సలహాదారు ఎం.తిరుపతిరావు ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శివనాథ్‌(చిన్ని)ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల పనిష్మెంట్‌కు సంబంధించి అధికారుల సమగ్ర పరిశీలన అనంతరం 2019లో ఒక సర్క్యులర్‌ విడుదల చేశారని, తద్వారా ఉద్యోగులకు మేలు జరిగేదని ఎంపీ చిన్నికి వివరించారు. ఆ సర్క్యులర్‌ అమలులో ఉండగానే మళ్లీ 70, 71 జీఓలను జారీ చేసి వాటి ద్వారా పాత పద్ధతుల్లోనే చర్యలు తీసుకుంటూ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు జీఓలను రద్దు చేసి 2019 సర్క్యూలర్‌ను మాత్రమే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్‌ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అసోసియేషన్‌ అధ్యక్షుడు శేషగిరిరావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement