పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
కోనేరుసెంటర్:క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. కృష్ణా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడుతూ క్రీడలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. విధుల్లో భాగంగా పోలీసులు ఎన్నో రకాల కర్తవ్యాలు నిర్వహిస్తూ సతమతమవుతూ ఉంటారని చెప్పారు. ఇటీవల కాలంలో సంభవించిన వరదల సమయంలోనూ పోలీసు అధికారులు ఎంతో సాహసంతో విధులు నిర్వర్తించి ప్రజలను కాపాడేందుకు రిస్క్ తీసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అతిథిగా వచ్చి తన చేతుల మీదుగా క్రీడలను ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో స్పోర్ట్స్ మీట్లో పాల్గొనాలని కోరారు. పోలీస్ అంటేనే 365 రోజులు మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ విధులు నిర్వహించడమని తెలిపారు. అటువంటి పోలీస్ సిబ్బందికి క్రీడా పోటీలు మానసిక స్థైర్యాన్ని పెంపొందించి ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. స్పోర్ట్స్ మీట్ జరుపుకోవటానికి అవకాశం కల్పించిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్‌కు కృష్ణాజిల్లా పోలీసుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్, బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు సబ్‌డివిజన్‌ల అధికారులున్నారు.
కృష్ణా జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను
ప్రారంభించిన జిల్లా ప్రధాన
న్యాయమూర్తి అరుణసారిక
వివిధ క్రీడల్లో పోటీల నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment