కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024
u8లో
యార్డుకు 43,356 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 43,356 మిర్చి బస్తాలు వచ్చాయి. 39,948 బస్తాలు అమ్మకాలు జరిగాయి.
శివయ్యకు అన్నాభిషేకం
నాగాయలంక: నాగాయలంక కృష్ణానది తీరంలోని శ్రీరామ పాదక్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీరామ లింగేశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు.
బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన
బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్‌లో మంగళవారం యుఎఫ్‌బీఆర్వో ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
సాక్షి, మచిలీపట్నం: ‘గూడూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవలే పెడన ఎమ్మెల్యేతో తమ సమస్య చెప్పుకొని పరిష్కారం కోసం ఆయన కార్యాలయానికి వెళ్లారు. అక్కడున్న ఓ వ్యక్తి వారిని ఎమ్మెల్యే కంటే ముందుగా అక్కడున్న ఓ పీఏ సార్‌ని కలవమని చెప్పారు. రెండు గంటల తరువాత ఆ పీఏను కలిసే వీలు కాగా.. డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న తమ కుర్రాడికి ఫీల్డ్ అసిస్టెంట్ గానో.. లేదా ఏదో ఓ కాంట్రాక్టు ఉద్యోగం చూపించమని ఎమ్మెల్యేని కలిసి కోరేందుకు వచ్చాం అని చెప్పారు. అయితే, సార్‌ను కలవాల్సిన అవసరం లేదు. నేను ఎంత చెబితే అంత. నేను చెప్పాక సార్ కాదనరు. ఎంత ఇచ్చుకోగలరో చెప్పండి. మీరిచ్చుకునే డబ్బును బట్టి పోస్టు ఉంటుందని చెప్పారు. తాము పేదోళ్లమని చెప్పినా.. పోస్టును బట్టి రేటు ఉంటుందని ఎమ్మెల్యే పీఏ చెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు.’
జిల్లాలో పరిస్థితి ఇలా..
● మచిలీపట్నం ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర వద్ద పనిచేస్తున్న ఓ పర్సనల్ సెక్రటరీ షాడోగా మారారు. అధికారులు, ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టు పనులకు సిఫార్సులు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈయనతో పాటు ఓ టీడీపీ సీనియర్ నాయకుడు ఇటీవలే జరిగిన బదిలీల్లో.. కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు పోస్టింగ్స్, పలు అంశాల్లో షాడోగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది.
● పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వద్ద పనిచేస్తున్న ఓ పీఏ షాడో ఎమ్మెల్యేగా మారినట్లు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తండ్రి కాగిత వెంకటరావు నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా చేసిన సమయంలో కూడా ఆయన హవా నడిచిందని, ఇప్పుడు తనయుడి వద్ద ఉంటూ అంతా తానై వ్యవహరిస్తున్నట్లు అనుకుంటున్నారు.
● అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ వారసుడు అన్ని పనులు చక్కబెడుతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పరంగా జరిగే అధికారిక సమావేశాలు, కార్యక్రమాలు, గ్రామసభల్లో పాల్గొనడంతో పాటు అధికారులనే ఇంటికి రప్పించుకుని సమీక్ష జరుపుతున్నారని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామసభలు, రైతులకు ఎరువులు పంపిణీ, ఇతర పథకాల పంపిణీలో పాల్గొంటున్నారు. ఇటీవలే జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని, కేక్ కట్ చేయించడం చర్చనీయంశంగా మారింది.
● గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి సోదరుడి వరుస అయిన ఓ వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా మారారు. ప్రజా ప్రతినిధి వద్దకు వచ్చే ఉద్యోగులు, ఇతర వర్గాల వారు, జనం ముందు ఆయనను సంప్రదించి, తమ పనులు చెప్పుకోవాల్సి వస్తుందని, ఆయన ఒప్పుకుంటే అన్ని పనులు అయిపోతాయని చెప్పుకుంటున్నారు.
● పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రధాన అనుచరుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉంటూ, ఎమ్మెల్యే కోసం వచ్చిన వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. పనికో రేటు కట్టి, సెటిల్‌మెంట్ అయిన తరువాత అన్ని పనులు చేయిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు.
విజయవాడ నగరం మంగళవారం కోలాహలంగా మారింది. శ్రీ శృంగేరి శారదాపీఠానికి మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేశారు. పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతిస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివ వచ్చారు. – గాంధీనగర్(విజయవాడసెంట్రల్)
7
న్యూస్‌రీల్
నగరంలో జగన్నినాదం
చిన్నసార్లు
పెద్ద
పెత్తనం...
షాడో ఎమ్మెల్యేలుగా సోదరులు,
పీఏలు, అనుచరులు
అన్నీతామై చూసుకుంటూ పైరవీలు
పనులు, పోస్టింగ్స్, కాంట్రాక్టు
ఉద్యోగాల్లో ప్రధాన పాత్ర
ఎమ్మెల్యే లెటర్లు, సిఫార్సులు
వీరి చెప్పిన వారికే
ఇబ్బందులు పడుతున్న జనం
కృష్ణా జిల్లాలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల వద్ద ఉంటున్న చిన్న సార్లు పెద్ద పెత్తనం చెలాయిస్తున్నారు. ఎమ్మెల్యేల వద్ద పీఏలుగా ఉన్న వాళ్లు కొందరైతే.. మరి కొంతమంది బంధువులు అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారిని కలిస్తే చాలు.. అన్ని పనులు చేసి పెడుతామంటున్నారని చెబుతున్నారు. పనికో రేటు కట్టి.. డబ్బు వసూలు చేయడంతో పాటు పనులపై హామీ ఇస్తున్నారు. పైగా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి, ఫలానా మనిషిని పంపిస్తున్నాను... ఆయనకు కావాల్సిన పని చేసి పెట్టండి అని హుకుం జారీ చేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. అని తామే అన్నట్లు పెత్తనం చెలాయిస్తూ.. షాడో ఎమ్మెల్యేగా మారినట్లు చర్చ జరుగుతోంది. దీంతో పనులు కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment