చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారునికి వడ్డీతో బీమా మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ కార్యనిర్వహణ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల మంగళవారం తీర్పునిచ్చారు. మచిలీపట్నం నగరానికి చెందిన చలువాది ఓంప్రకాష్ స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2021లో తమతో పాటు కుటుంబ సభ్యులకు హెల్త్ పాలసీని తీసుకున్నారు. 2023లో ఓంప్రకాష్‌కు అనారోగ్య కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి హెర్నియా ఆపరేషన్ చేయించుకోవటంతో రూ.63,256 ఖర్చు అయ్యింది. ఈ మొత్తాన్ని క్లయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా హెర్నియా ఆపరేషన్‌ను తమ పరిధిలో లేని ఆస్పత్రిలో చేయించారని క్లయిమ్‌ను తిరస్కరించారు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవటంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పూర్వాపరాలను విచారించిన అనంతరం కమిషన్ సభ్యులు ఓంప్రకాష్ కు రూ.58,714 లు బీమా మొత్తాన్ని 2023 సెప్టెంబరు 13వ తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు రూ.15 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment