ఉఫ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉఫ్‌

Published Sun, Nov 24 2024 4:04 PM | Last Updated on Sun, Nov 24 2024 4:04 PM

ఉఫ్‌

ఉఫ్‌

వక్ఫ్‌

భూములు..

గుడ్లవల్లేరు: జిల్లాలోని వక్ఫ్‌బోర్డు భూములు కబ్జా కోరల్లో మగ్గుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని మసీదులు, ఫకీరు చావిడిల భూములు ఏళ్ల తరబడి ఆక్రమణల చెరలో ఉన్నా పట్టించుకున్నవారే లేరు. రెండు జిల్లాల్లో 372 మసీదులు, ఫకీర్‌ చావిడిలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 2,653.56 ఎకరాల్లో వక్ఫ్‌ భూములున్నాయి. వీటిలో 984.08 ఎకరాలు ఆక్రమణల చెరలో ఉన్నాయి. కబ్జా పాలైన భూముల్లో 636.54 ఎకరాల్లో భూముల స్వాధీనానికి అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని వక్ఫ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్‌, ఎస్పీలకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కట్టా హర్షవర్ధన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 10న ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు వాటిని స్వాధీనం చేసుకోవడంలో వక్ఫ్‌ బోర్డుల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇవి ఆక్రమణలకు గురవడంతో చట్ట ప్రకారం ఆక్రమిత భూములను కలెక్టర్‌ స్వాధీనం చేసుకోవాలని కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఆక్రమణదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఆక్రమణదారుల పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు వచ్చాయి.

ఆక్రమణల డొంక కదిలింది ఇలా...

ఇటీవల కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీకి ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌ గౌడ్‌ జిల్లాలోనే పమిడిముక్కల మండలం ఫతేలంక మసీదు మాన్యం ఆక్రమణలో ఉన్నట్లుగా వినతిని అందించారు. అంతకు ముందే రాష్ట్రంలో ఆక్రమణలోని వక్ఫ్‌బోర్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఉప లోకాయుక్తను రాత పూర్వకంగా కోరారు. రాష్ట్ర ఉప లోకాయుక్త జస్టిస్‌ పి.రజని ఉత్తర్వుల మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తగు చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వులు ఇచ్చారు.

కలెక్టర్‌ బాలాజీకి వక్ఫ్‌ భూముల ఆక్రమణపై వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం(ఫైల్‌)

ఆక్రమణల భూములు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు!

వక్ఫ్‌ భూముల ఆక్రమణ వాస్తవమే

వక్ఫ్‌బోర్డ్‌ ములు ఆక్రమణకు గురైన మాట వాస్తవమే. మా పరిధిలోని ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణా ల్లాల్లోని వక్ఫ్‌ భూముల్లో ఆక్రమణదారులను తొలగించి వాటిని స్వాధీనం చేసుకోనున్నాం. ప్రస్తుతం ఆ ఆక్రమణ భూముల విషయమై విచారణ చేస్తున్నాం. ఆక్రమణదారులకు కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి...ఆ సర్వే నంబర్లను బ్లాక్‌ చేశాం. గత రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి పని చేస్తున్నాం.

– మహ్మద్‌ నూహు ఆలీ షా,

వక్ఫ్‌బోర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఉమ్మడి ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement