నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలోని నిత్యాన్నదానానికి ఏలూరుకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఏలూరు గొల్లయిగూడెంకు చెందిన వెంకట పతిరావు దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. చైన్నె తిరుచ్చికి సమీపంలోని మన్నచ్చన్నలూర్‌కు చెందిన రాధ కన్నన్ దంపతులు వారి కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రికి విచ్చేసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం వారికి ప్రసాదాలు అందజేశారు.
కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరం
పటమట(విజయవాడతూర్పు): కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ప్రత్యేక క్యాంపు ఏర్పాటుచేసినట్లు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అన్నారు. శనివారం ఉదయం మహిళా మాంటిసోరి కళాశాల, బిషప్ అజరయ్య పాఠశాలల్లోని పోలింగ్ బూతులను ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, సెంట్రల్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కమిషనర్ ధ్యానచంద్ర, ఈస్ట్ ఆఫీసర్ చైతన్యకుమార్‌తో పర్యటించి అక్కడ జరుగుతున్న ఓటర్ నమోదు క్యాంపైన్‌ను పరిశీలించారు. ఎలక్షన్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు శనివారం, ఆదివారం సంబంధిత పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వీఎంసీ పరిధిలోని ‘సెంట్రల్’లో 1 నుంచి 267 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పర్యటనలో వీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) పి.సత్యకుమారి, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, బూతు లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుడివాడ టౌన్: 108 వాహనంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ హరీష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జీఎన్‌ఎం, బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(ఎంఎల్‌టీ), బీఎస్సీ (మైక్రోబయాలజి) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 89191 97050, 98488 47042 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment