ప్రతి జిల్లాలో సైబర్ పీఎస్‌కు చర్యలు
ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ వెల్లడి
పెడన: ప్రతి జిల్లాలో సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన కృష్ణా ఎస్పీ గంగాధర్‌తో కలిసి పెడన పీఎస్‌ను సందర్శించారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించిన ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు విషయాలను వెల్లడించారు. విద్యావంతులు కూడా సైబర్‌నేరాలకు గురవుతున్నారని, వీటిపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తే అరికట్టవచ్చన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1930కి మూడు గంటల లోపు ఫిర్యాదు చేయగలిగితే ఆ నగదు బదిలీ కాకుండా నిలువరించడానికి అవకాశాలున్నాయన్నారు. ఈ నేరాలపై బ్యాంకు అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించి సేవింగ్స్ ఖాతాల నుంచి కరెంట్ ఖాతాలకు బదిలీ అయ్యే నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని కోరామన్నారు. లైంగిక దాడులు, మహిళల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. సమావేశంలో మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాని, పెడన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ సత్యనారాయణ, ఎస్‌ఐ–2 రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment