దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం

Published Wed, Nov 27 2024 7:18 AM | Last Updated on Wed, Nov 27 2024 7:18 AM

దుర్గ

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విశాఖపట్నంకు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. విశాఖ పట్నంకు చెందిన ఉప్పలపాటి నరేంద్రనాథ్‌ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందించింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఆలయ డీఈవో రత్నరాజు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

రేపటి నుంచి కేయూలో స్పాట్‌ అడ్మిషన్లు

కోనేరుసెంటర్‌: పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు స్పాట్‌ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ ఎల్‌.సుశీల తెలిపారు. పీజీ కోర్సులలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కాని వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో మచిలీపట్నంకు, నూజివీడు పీజీ సెంటర్‌ లో చేరదలిచిన అభ్యర్థులు స్వయంగా అక్కడికే వెళ్లి రిపోర్ట్‌ చేయవచ్చని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా శిల్పారామం

చైర్‌పర్సన్‌గా బాధ్యతలను

స్వీకరించిన మంజులారెడ్డి

భవానీపురం(విజయవాడపశ్చిమ): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే శిల్పారామం కేంద్రాలను మరింత అభివృద్ధి చేసే విధంగా తీర్చిదిద్దుతానని శిల్పారామం సొసైటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన మాచర్ల పట్టణానికి చెందిన మంజులారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని శిల్పారామం ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌, కల్చరల్‌ సొసైటీ కార్యాలయంలో ఆమె మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శిల్పారామం సీఈఓ స్వామినాయుడు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తదితరులు ఆమెను అభినందించారు. అనంతరం మంజులారెడ్డి మాట్లాడుతూ శిల్పారామం సొసైటీ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేసేలా కృషి చేస్తానన్నారు.

ధాన్యం కొనుగోలులో ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌

జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో పండిన ధాన్యాన్ని విక్రయించటంలో ఎటువంటి ఇబ్బందులు, ఫిర్యాదులు వచ్చినా తెలియజేసేందుకు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్‌రూమ్‌లో సిబ్బంది అందుబాటులో ఉండి రైతుల ఫిర్యాదులు, సందేహాలు, సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తారన్నారు. రైతులకు ధాన్యం విక్రయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఫోన్‌ నంబర్‌ 82476 93551 కు తెలియజేయాలని కోరారు.

ఉత్సాహంగా

బాక్సింగ్‌ ఎంపిక పోటీలు

కేతనకొండ(ఇబ్రహీంపట్నం): కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ బాక్సింగ్‌ ఎంపిక పోటీలు కేతనకొండ ఆర్కే ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. పోటీలను కళాశాల కార్యదర్శి ఎం.మహేంద్రనాథ్‌, ప్రిన్సిపాల్‌ కె.రామకృష్ణయ్య, యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కార్యదర్శి శ్యాంకుమార్‌ ప్రారంభించారు. వివిధ కళాశాలలకు చెందిన 25మంది విద్యార్థులు పోటీల్లో తలపడ్డారు. తుదిపోరులో పోటీపడి ప్రతిభ చాటిన ఐదుగురు యువకులు, నలుగురు యువతులను సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపిక చేశారు. ఆర్కే కళాశాలకు చెందిన కోమల అనే విద్యార్థిని కూడా ఎంపికై నట్లు కళాశాల కార్యదర్శి మహేంద్రనాథ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం 
1
1/2

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం 
2
2/2

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement