శ్రీఅమ్మయే శరణంతిరుపతాంబ
వైభవంగా తిరుపతమ్మ మండల దీక్షలు
పెనుగంచిప్రోలు: ఓం శ్రీఅమ్మయే శరణం తిరుపతాంబ.. ఓం శ్రీస్వామియే శరణం గోపయ్య.. అంటూ అమ్మవారి శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ మండల దీక్ష మాలధారణ బుధవారం వైభవంగా ప్రారంభ మైంది. తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఎదుట ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ కిషోర్‌కుమార్, ప్రధానార్చకుడు మర్రెబోయిన గోపిబాబు సమక్షంలో అర్చకులు సూరిబాబు, ప్రసాద్ ముందుగా మాల వేసుకుని మాలధారణ ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 1000 మందికి పైగా స్వాములు మాలలు వేసుకున్నారు. మాల వేసుకున్న దీక్షాధారులకు సింగరాయకొండకు చెందిన శివమ్మస్వామి దంపతులు ఉచితంగా పులిహోర, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బెజవాడ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
స్కేటింగ్ పోటీల్లో
జిల్లా క్రీడాకారుల సత్తా
విజయవాడస్పోర్ట్స్: కర్ణాటకలో ఇటీవల జరిగిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపి యన్ షిప్‌లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులను కృష్ణా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ జె.దుర్గాప్రసాద్, దాసరి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అభినందించారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పూర్విహన్సిక, తనుష్క, కోటేశ్వర్, విఘ్నేష్, దినేష్‌కుమార్, అంచిత, కైవల్య, దీపిక, హృతిక్, పునర్నవి, నందిని, లాస్య, శ్రీనిత్య, అన్విత, వాహిఉపగ్న, కిరణ్‌కుమార్, గోపాల్‌కౌషిక్, ఆశిక, కె.కారుణ్య, పి.కారుణ్య, దివిష, వన్షిక, నిఖిల, తనిసిసాయి అద్భుతమైన ప్రదర్శనతో పతకాలు కై వసం చేసుకుని జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్‌లను అభినందించారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు ఎల్.వెంకటేశ్వరరావు, రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత దత్త క్రియా
యోగ శిక్షణ తరగతులు
పటమట(విజయవాడతూర్పు): పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉచిత దత్త క్రియాయోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని దత్త క్రియా యోగ సమన్వయకర్త దంతులూరి తిరుపతి రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తరగతులు ఆయా తేదీల్లో ఉదయం 6–7 గంటల మధ్య నిర్వహించనున్నామని, శిక్షణ పొందేందుకు 12 ఏళ్లు పైబడిన వారంతా అర్హులేనని తెలిపారు. ఇందులో వివిధ ప్రాణాయామాలు, నాడీశుద్ధి వ్యాయామాలు, ముద్రలు, ధ్యాన ప్రక్రియల్లో శిక్షణ, సాధన ఉంటుందన్నారు. వివరాలకు ఫోన్ నంబర్ 98660 41332 సంప్రదించాలని ఆయన కోరారు.
మన దేశం సర్వమత సమ్మేళనం
తాడేపల్లిరూరల్ : మన భారత దేశం సర్వమత సమ్మేళనం అని త్రిదండి చిన్న జీయర్‌స్వామి అన్నారు. బుధవారం మంగళగిరిలోని బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా 10వ పాశురాన్ని భక్తులకు స్వామివారు వివరించారు. క్రిస్మస్ సందర్భంగా యావత్ క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో తరాలుగా ఎటువంటి భేదం లేకుండా అంతా ఈ దేశంలో నివసిస్తున్నామని, మున్ముందు కూడా ఇలానే కలసి మెలసి ఉండాలని ఆయన అన్నారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా విజయవాడ, నరసరావుపేట, మచిలీపట్నం ప్రాంతాల నుంచి సుమారు 280 మంది భక్తులు గోదా అమ్మవారికి సారె సమర్పించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment