పెడన: పట్టణంలో వేంచేసియున్న శ్రీపైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు పూర్తి కావడంతో అమ్మవారు గ్రామోత్సవానికి వెళ్లి బుధవారం ఉదయం తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకటమోహనరావు, ఆసాది తోట రామారావు, ఉత్సవ కమిటీ సభ్యులు, దేవదాయ శాఖ సిబ్బంది అమ్మవారిని ఉయ్యాలలో పెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పుష్పాలను జల్లి ఉయ్యాల సేవ చేశారు. అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి ఆలయంలోకి తీసుకువెళ్లారు. అమ్మవారి ఉయ్యాలో చిన్నారులను కూర్చోబెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో తమ చిన్నారులను కూర్చొబెట్టేందుకు తల్లులు, బంధువులు పోటీపడ్డారు. ఆలయ ఈవో మోహనరావు మాట్లాడుతూ పైడమ్మ జాతర మహోత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయన్నారు. సహకరించిన ఆయా డిపార్ట్‌మెంట్లవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 2025 జనవరి 5వ తేదీన భారీ అన్న సమారాధన ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాలను స్వీకరించాల్సిందిగా ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment