సైకిల్‌పై శబరిమలకు ..
విస్సన్నపేట: మండల దీక్ష చేపట్టిన విస్సన్నపేటకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు బుధవారం శబరిమలకు సైకిలు యాత్ర చేపట్టారు. స్థానిక శివాలయం వద్ద ఏర్పాటు చేసిన జ్యోతి పీఠంలో దీక్ష నిర్వహిస్తున్న గున్న శ్రీను, చింతల భార్గవ, మల్లేశ్వరపు జగదీష్‌తో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మరో భక్తుడితో కలిసి శివాలయంలో ఇరుముడులు కట్టుకుని సైకిల్‌పై శబరిమల యాత్రకు బయల్దేరారు.
నేడు ఫెన్సింగ్ జిల్లా జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–17 బాల, బాలికల ఫెన్సింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లను ఈ నెల 26వ తేదీన వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్యా పాఠశాలలో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణాజిల్లా ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి నాగం సతీష్ బుధవారం తెలిపారు. 200 జనవరి ఒకటో తేదీ నుంచి 2011 డిసెంబర్ 21వ తేదీ మధ్యలో జన్మించి, భారత ఫెన్సింగ్ సమాఖ్య గుర్తింపు కార్డు ఉన్న వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఐడీ, ఆధార్‌కార్డ్, జనన ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత ఫెన్సింగ్ కిట్టుతో ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 95535 28888ను సంప్రదించాలని పేర్కొన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28, 29 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment