సొంతింటి కల నెరవేరకూడదనే..
పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారు. స్థలాలు ఉచితంగా ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశారు. అది కూటమి ప్రభుత్వంలో పేదల పాలిట శాపంగా మారింది. ఆ పేదల సొంతింటి కలను నెరవేరకుండా బిల్లులకు మోకాలడ్డుతూ, మెటీరియల్ దిగుమతి చేయకుండా ఈ ప్రభుత్వం పేదలపై కక్ష తీర్చుకుంటోంది.
– పడమటి సుజాత, వైఎస్సార్ సీపీ గుడ్లవల్లేరు మండలం మహిళా అధ్యక్షురాలు
పేదలంటే అలుసా..?
బాబు ప్రభుత్వంలో పేదలంటే అలుసుగా కనపడుతున్నారా? పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా అడ్డంకులే. ఒకవైపు ఇసుక కృత్రిమ కొరత వస్తుంటే, మరొక వైపు స్టీల్, సిమెంట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు గృహ నిర్మాణ మెటీరియల్‌ను దిగుమతి చేయకపోతే పేద కుటుంబాల వారు ఇళ్లను ఎలా నిర్మించుకుంటారు.
– బలుసు జితేంద్ర, వైఎస్సార్ సీపీ గుడ్లవల్లేరు మండల బూత్ కమిటీల కన్వీనర్
●
Comments
Please login to add a commentAdd a comment