ఎట్టకేలకు బీఎల్‌వోలకు వేతనాల విడుదల
గుడ్లవల్లేరు: ఎట్టకేలకు జిల్లాలోని బూత్ లెవల్ ఆఫీసర్ల(బీఎల్‌వోల)కు వేతనాలు విడుదల చేశారు. గత నెల 19వ తేదీన ‘బీఎల్‌వోలకు వేతనాలు ఇప్పించరూ’ అనే శీర్షికన కథనం ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఆ కథనానికి స్పందించిన ఎన్నికల అధికారులు జిల్లాలోని 1,754 మంది బీఎల్‌వోలకు రూ.1,05,24,000 విడుదల చేసినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ వేతనాలను కేవలం 2022–23 సంవత్సరానికి సంబంధించిన ఎన్నికల విధులకు ఒక్కో బీఎల్‌వోకు ఏడాదికి రూ.6వేల చొప్పున మాత్రమే విడుదల చేయటం జరిగింది. ఇంకా 2024 ఎన్నికల విధులకు సంబంధించిన వేతనాలను విడుదల చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment