ప్రజాకంటక సర్కార్‌పై సమరశంఖం
అర చేతిలో వైకుంఠం మాదిరిగా సూపర్ సిక్స్ అంటూ హామీలతో ఊరించి, అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఎప్పటిలాగే జనకంటక స్వభావాన్ని బయట పెట్టుకున్నారు. ఏరు దాటాక తెప్పతగలేసిన చందంగా ప్రజలపై నిర్దాక్షిణ్యంగా భారాలు మోపుతున్నారు. ఆయన గద్దెనెక్కాక నిత్యావసర వస్తువుల ధరల నుంచి విద్యుత్ చార్జీల వరకూ అన్నీ పెరిగిపోయాయి. జనజీవితాన్ని భారంగా మార్చాయి. ఈ బాదుడు పర్వంపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరించింది. పెరిగిన విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పోరుబాట పట్టింది. ప్రజల పక్షాన నిలబడి పెద్ద పెట్టున నినదిస్తూ కదం తొక్కింది.
చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ కరెంట్ చార్జీల బాదుడుపై శుక్రవారం పోరుబాట కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పోరుబాట నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు నాయకులు వినతి పత్రాలు అందజేశారు. పామర్రులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ శాసనసభ్యుడు కై లే అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము అధికారంలో వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం విద్యుత్‌చార్జీలు పెంపుదల చేసి పేద ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు.
● పామర్రు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం విద్యుత్‌శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. అనంతరం విద్యుత్‌శాఖ ఏడీఈ సుందరరావుకు వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్, పార్టీ నాయకులు సురేష్, జొన్నల రామ్మోహన్‌రెడ్డి, పళ్లం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
● పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి సారథ్యంలో గంగూరులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పోరుబాట నిర్వహించారు. అనంతరం విద్యుత్‌శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పార్టీ సీనియర్ నాయకులు అన్నే చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి జి. ప్రణీత్‌కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచనల మేరకు పార్టీ నాయకులు నగరంలోని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కార్యాలయం వద్ద పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్‌శాఖ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవటంతో ఎస్‌ఈ కుర్చీకి వినతిపత్రం అందజేశారు. పార్టీ నగర కన్వీనర్ షేక్ సలార్‌దాదా, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు లంకే వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ షేక్ అచ్చేబా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
● గుడివాడ నియోజకవర్గంలోని విద్యుత్‌శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు నిరసన తెలిపారు. కార్యాలయంలో ఏడీఈ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కందుల దుర్గాకుమారి, గోళ్ల రామకృష్ణ, ఎంపీపీ ఆదాం, పార్టీ నాయకులు పాలేటి చంటి, కె. ఆంజనేయప్రసాద్ పాల్గొన్నారు.
● గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా గన్నవరం సబ్‌స్టేషన్ ఏఈకి వినతిపత్రం అందజేశారు. గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌రాణి, బాపులపాడు మండలం అధ్యక్షుడు నక్కా గాంధీ, కన్వీనర్ అవిరినేని శేషగిరిరావు, పార్టీ నాయకులు దయాల విజయ్‌నాయుడు, తమ్మిశెట్టి రఘుబాబు, కోట వినయ్‌కుమార్, తిరువీధి రవి, దేవరపల్లి రాంబాబు, నిడమర్తి రామారావు, ఎస్ ఆంజనేయులు, పులవర్తి మస్తాన్ పాల్గొన్నారు.
●
అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఎలక్ట్రికల్ ఏడీఈకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, యాదవరెడ్డి సత్యనారాయణ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుట్టి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం బసవయ్య, గార్లపాటి గోపీ పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రమేష్ (రాము) ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లి విద్యుత్‌శాఖ ఏఈ ఏడుకొండలుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు కొండవీటి నాగబాబు, పర్ణం పెదబాబు, వైదాని వెంకటరాజు, బండారు మల్లికార్జునరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్ సీపీ పోరుబాట ప్రజలతో కలిసి కదం తొక్కిన పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు భారీ ర్యాలీలతో విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిరసన పామర్రులో పోలీసుల అడ్డంకులు బందరులో ఎస్‌ఈ కుర్చీకి వినతిపత్రం సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment