ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్జీవో ఎన్టీఆర్ జిల్లా శాఖ 2025 క్యాలెండర్‌ను కలెక్టర్ జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంఘ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు సమష్టిగా పనిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శి డి.సత్యనారాయణరెడ్డి, జిల్లా సహాధ్యక్షులు పి.రమేష్, కోశాధికారి బి.సతీష్ కుమార్, కార్యవర్గ సభ్యులు వి.నాగార్జున, ఎం.రాజుబాబు, జి.రామకృష్ణ, ఆర్.శ్రీనివాస్, ఎం.గోపాలకృష్ణ, బీవీ రమణ, కె.శివలీల, నగర శాఖ కార్యవర్గ సభ్యులు సీవీఆర్ ప్రసాద్, ఎస్‌కే నజీరుద్దీన్, డీఎస్‌ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment