‘టెర్మినల్’ పనులు వేగవంతం చేయండి
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఆయన నూతన టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించారు. టెర్మినల్ నిర్మాణ పనుల పురోగతిని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, సివిల్ విభాగం అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో నూతన టెర్మినల్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లోపు నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రయాణికులకు టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. దీనికోసం ఎయిర్‌పోర్ట్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. పలువురు ఎయిర్‌పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు
Comments
Please login to add a commentAdd a comment