దుర్గమ్మకు నృత్య నీరాజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం పలువురు నృత్య కళాకారులు నృత్య నీరాజనాలు అర్పించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన శ్రీనాట్య వేద ఆర్ట్స్ అకాడమీకి చెందిన లలితాదేవి పర్యవేక్షణలో 25 మంది చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై పలు కీర్తనలకు నృత్య ప్రదర్శన ఇవ్వగా భక్తులకు విశేషంగా అలరించింది. అనంతరం శిష్య బృందానికి అమ్మవారి దర్శనం కల్పించారు. నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులకు ఆలయ డీఈవో రత్నరాజు దేవస్థానం తరఫున ప్రశంసాప్రతాలు, ప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment