కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులు
మోపిదేవి: కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక విద్యను అందించేందుకు ఎస్‌ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. మండల కేంద్ర మైన మోపిదేవిలోని ఆశ్రమ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్ రిసోర్స్ సెంట ర్‌ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి అంశాల్లో ఈ సెంటర్లు శిక్షణ ఇస్తాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 104 వసతి గృహాల్లో నూతనంగా ప్రభుత్వం ఎస్‌ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో మోపిదేవి, అవనిగడ్డ, పోలాటితిప్ప, కూచిపూడి, గన్నవరంలో ఈ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో వసతులు, మధ్యాహ్న భోజనంపై మంత్రి సవిత ఓ విద్యార్థిని నుంచి వివరాలు రాబ ట్టారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జునరావు, అడిషనల్ డైరెక్టర్ బమ్మరాజు చంద్రశేఖర్‌రాజు, బీసీ వెల్ఫేర్ జేడీ శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధికారి జి.రమేష్, టీడీపీ నాయకులు మండలి వెంకట్రామ్, కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment