ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వైద్య ఆరోగ్య, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు పీహెచ్‌సీలను సందర్శించి మెరుగైన వైద్యసేవలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. అధిక మొత్తంలో డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలోని ఆరోగ్య కేంద్ర భవనాన్ని కూల్చివేసి నూతన భవనం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ఎదురుమొండి, సొర్లగొంది పరిధిలోని పీహెచ్‌సీల్లో వైద్యా ధికారులు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. రేడియాలజీ, గైనకాలజీ వైద్యులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ల సిబ్బందిని నియమించాలన్నారు. ఈ సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ శర్మిష్ట, నేషనల్ హెల్త్ మిషన్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఆయుష్మాన్ భారత్ మెడికల్ ఆఫీసర్ నరేష్, ఆరోగ్య శ్రీ కో–ఆర్డినేటర్ సతీష్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment