చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమా లపై కొన్ని ఆదేశాలు ఇచ్చారని వాటి అమలులో భాగంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, ఐటీఐ ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్‌ల తదితరులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుడివాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ నోడల్ ప్రిన్సిపాల్‌గా, ఇతర ప్రైవేట్ ఐటీఐ విద్యాసంస్థలను సమన్వయం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధి కారి నరేష్‌కుమార్, గుడివాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ గౌరీ మణి, జిల్లా ఉపాధి కల్పనాధికారి విక్టర్‌బాబు, సీడాప్ అధికారి సుమలత, జిల్లా పరిశ్రమల అధికారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment