విజయవాడ డివిజన్‌కు ‘జీఎం ఎఫిషియెన్సీ షీల్డ్’
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్‌లోని కలారంగ్‌లో జరిగిన ‘69వ జోనల్ రైల్వే వీర్ అవార్డ్ – విశిష్ట రైలు సేవా పురస్కార్ 2024’లో అన్ని విభాగాల్లోను అత్యుత్తమ ప్రతిభ కనపర్చినందుకు విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్లు సంయుక్తంగా ఎంపికయ్యాయి. ఈ మేరకు శుక్రవారం విజయవాడ డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా జీఎం ఎఫిషియెన్సీ షీల్డ్‌ను అందుకున్నారు. వివిధ విభాగాల్లో డివిజన్ మొత్తం 36 అవార్డులు అందుకోగా అందులో 12 ఎఫిషియెన్సీ షీల్డ్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా డివిజన్‌లో అత్యుత్తంగా పనిచేసిన అన్ని విభాగాల అధికారులను డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment