కటింగ్ మాస్టర్
నకిలీల పేరుతో దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు కుట్ర
గుడ్లవల్లేరు: జిల్లాలో ఇంటింటికీ దివ్యాంగ పింఛన్ల తనిఖీలకు ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్లేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. నకిలీ ధ్రువ పత్రాలతో కొందరు దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వారిని గుర్తించి తొలగించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లను ఇచ్చింది.
కోత విధించేందుకేనా..?
దివ్యాంగ పింఛనుదారుల్లో జిల్లా వ్యాప్తంగా అనర్హుల లెక్క తేల్చేందుకే కూటమి ప్రభుత్వం సిద్ధ మైంది. జిల్లాలో మంచానికే పరిమితమైన వారి కేటగిరిలో రూ.15వేలు, వైకల్య ధ్రువ పత్రాలు ఉంటే రూ.6వేల చొప్పున పింఛన్లను పొందుతున్న వారి పత్రాలు, వివరాలను సమగ్రంగా పరిశీలించి కోతలను విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజంగా అనర్హుల్ని తొలగిస్తే... అందరూ హర్షిస్తారు. కానీ అనర్హుల మాటున నిజమైన లబ్ధిదారులను తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చాలా చోట్ల దివ్యాంగులన్న జాలి కూడా లేకుండా తమ అధికార బలంతో అర్హుల పింఛన్లను సైతం తొలగించి కక్ష సాధించడమే అందుకు నిదర్శనమని అంటున్నారు.
తాత్కాలికంగా సదరం ధ్రువ పత్రాల జారీ నిలుపుదల జిల్లాలో 2.37లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్న పింఛన్ల తగ్గింపునకు జల్లెడ పడుతున్న కూటమి సర్కార్
ధ్రువపత్రాలిచ్చిన డాక్టర్లను అనుమానిస్తున్నారా?
సదరం ద్వారానే దివ్యాంగుల వైకల్యాన్ని గుర్తించినపుడు మళ్లీ అదే డాక్టర్లతోనే విచారణలు ఎందుకు చేస్తున్నారు? అంటే ధ్రువ పత్రాలు ఇచ్చిన డాక్టర్లను అనుమానిస్తున్నారా?
– బందెల కిరణ్‌రాజు, వైఎస్సార్ సీపీ వికలాంగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
అర్హుల్ని బలి చేయొద్దు...
నకిలీల ఏరివేత పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అర్హుల్ని బలి చేస్తే మాత్రం జనం క్షమించరు. కూటమి ప్రభుత్వంలో అనేక మంది అర్హుల పింఛన్లను ఎత్తివేశారు.
– దొండపాటి మధు, దివ్యాంగుల సంఘ రీజనల్ కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment