ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర భూగర్భవనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి రవీంద్ర జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలసి స్థానిక లేడీయాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కళాశాలలోని విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేటి నుంచి 475 జూనియర్ కళాశాలల్లో 1.48 లక్షల మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యార్థులకు నోట్, పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. యూనిఫామ్ కూడా ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ జీవితంలో కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని అన్నారు. ‘హ్యారీ పోట్టర్‘ రచయిత్రి జేకే రోలింగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.సుందరలక్ష్మి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, గోపు సత్యనారాయణ, డీఈవో పీవీజే రామారావు, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి పీబీ సాల్మన్‌రాజు, ఎంఈఓ దుర్గాప్రసాద్, హైస్కూల్ హెచ్‌ఎం మెటిల్డారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment