కృష్ణా వర్సిటీ వాలీబాల్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల వాలీబాల్ మహిళల పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా యూనివర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన తెలిపారు. తమ కాలేజీ ఆధ్వర్యంలో ఇటీవల ఎంపిక పోటీల్లో అంత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన ఎస్.సంజన, అంకిత, దివ్య, దీవెన, సుప్రియ, మేఘన, హారిక, సీత, సుధారాణి, జయ, ప్రశాంతి, భువనేశ్వరి, తనుశ్రీ, దీపిక జట్టుకు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ జట్టుకు కోచ్, మేనేజర్‌గా కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.హేమ వ్యవహరిస్తారని, ఈ నెల ఏడు నుంచి 11వ తేదీ వరకు చైన్నెలోని జెప్పియార్ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని తెలిపారు. జట్టు బృందాన్ని కళాశాల ప్రాంగణంలో కళాశాల కన్వీనర్ లలితప్రసాద్, ప్రత్యేక అధికారి డాక్టర్ ఆర్.మాధవి అభినందించారు.
హైందవ శంఖారావం సభకు పటిష్ట భద్రత
గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో ఆదివారం జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభ ప్రాంగణాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమైన ఆయన భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ బహిరంగ సభకు సుమారు మూడు లక్షల మంది జనం వస్తున్న నేపథ్యంలో భద్రత పరంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మాట్లాడుతూ సుమారు మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment