తల్లికి వందనం పేరుతో మోసం చేసిన కూటమి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో 84 లక్షల మంది తల్లులను మోసం చేసిందని ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్ జి అన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద శుక్రవారం తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య( ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఇంట్లో ఎంత మంది చదువుకొనే పిల్లలు ఉంటే అంతమందికి పథకం కింద లబ్ధి చేకూరుస్తామని నమ్మబలికిందన్నారు. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ ఏడాది నుంచి పథకం అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.శివకుమార్, సాధిక్ బాబు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్
Comments
Please login to add a commentAdd a comment