ఏపీ ఎమ్మార్పీఎస్ అమరావతి అధ్యక్షుడిగా నాగమల్లేశ్వరరావు
ఇబ్రహీంపట్నం: ఏపీ ఎమ్మార్పీఎస్ అమరావతి అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నానికి చెందిన మందా నాగమల్లేశ్వరరావు నియమితులయ్యారు. ఏపీ ఎమ్మార్పీఎస్ విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ నాగమల్లేశ్వరరావును అమరావతి అధ్యక్షుడిగా నియమించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఫిబ్రవరి 5న విజయవాడలో జరగనున్న ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశం విజయవంతం చేయాలని నేతలకు సూచించారు. వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment