గన్నవరం: బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదు నెలలు జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ గన్నవరం 8వ అడిషనల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. బాపులపాడు మండలం బొమ్ములూరుకు చెందిన చిన్నం అమరేష్ తాపీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది ఫిబ్రవరి 4న గన్నవరంలోని టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన అమరేష్ తన బైక్‌ను రీచ్ స్కూల్ రోడ్డులో నిలిపి తాళం వేశాడు. కొద్దిసేపటి తర్వాత పార్కింగ్ చేసిన బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు బైక్‌ను పెదపారుపూడి మండలం వెంట్రప్రగడకు చెందిన అప్పికట్ల రాజీవ్ దొంగిలించినట్లు గుర్తించారు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో రాజీవ్‌కు కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజులు జైలుశిక్ష అమలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో గన్నవరం పోలీసులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.మాధవి వాదనలను వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment