ప్రణాళికాబద్ధంగా రీ సర్వే నిర్వహించాలి
గుడివాడ టౌన్: ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఒక క్రమ పద్ధతిలో రీ సర్వే నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం స్థానిక కేటీఆర్ మహిళా కళాశాల్లో గుడివాడ డివిజన్ పరిధిలోని తహసీల్దార్‌లు, వీఆర్వోలు, సర్వేయర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. రీ సర్వేపై పేపర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. రీ సర్వే ప్రక్రియలో తహసీల్దార్‌లు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్‌లు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ పగడ్బందీగా రీ సర్వే నిర్వహించాలని సూచించారు. సమస్యలు గల భూముల విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. అనుభవదారులు, హక్కుదారులు, ప్రైవేట్, ప్రభుత్వ భూములు, భూసేకరణ భూములు గుర్తించి పరిశీలించాలన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీఆర్‌ఓ కె.చంద్రశేఖరరావు, డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment