సకల మానవాళికి క్రీస్తు మార్గం అనుసరణీయం
హనుమాన్‌జంక్షన్ రూరల్: ఏసుక్రీసు బోధించిన ప్రేమ, దయ, క్షమాపణ సుగుణాలను సకల మాన వాళి ఆచరించాలని విజయవాడ మేత్రాసనం పీఠాధిపతి తెలగతోటి జోసఫ్ రాజారావు సూచించారు. స్థానిక గుడివాడరోడ్డులోని జ్యోతినగర్ ఆర్సీఎం చర్చిలో అద్భుత దివ్య బాల ఏసు మహోత్సవాలు రెండో రోజైన శనివారం ఘనంగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. అనంతరం జేఎంజే సిస్టర్లు బాల ఏసు గీతాలను ఆలపించారు. ఆర్సీఎం చర్చిని విద్యుత్ దీపాలతో విశేషంగా అలంకరించారు. జ్యోతినగర్ చర్చి ఫాదర్ చేబ్రోలు జోసఫ్ తంబి, ఫాదర్ వినోద్, ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment