10 కేజీల గంజాయి పట్టివేత
కంచికచర్ల: కంచికచర్ల పీఎస్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు రోజుల్లో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నందిగామ ఏసీపీ కె.బాలగంగాధర్ తిలక్ పేర్కొన్నారు. కంచికచర్ల పీఎస్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఏసీపీ మాట్లాడుతూ, సబ్ డివిజన్ ఆఫ్ పోలీస్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముఠాపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. కంచికచర్ల మండలంలో ఎక్కువగా ఇంజినీరింగ్ కళాశాలలున్నాయని, విద్యార్థులకు గంజాయి మూలాలు లేకుండా చేస్తామన్నారు. వారం పది రోజుల నుంచి నందిగామ, చిల్లకల్లు పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుమారు 500 కేజీల గంజాయిని, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కంచికచర్లకు సంబంధించి గురువారం సాయంత్రం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో కారును ఆపి అనుమానాస్పదంగా ఉన్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరినుంచి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను, ఆరు సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. శుక్రవారం ఉదయం జుజ్జూరు రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్‌లపై ఆరుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరారవుతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. వారి నుంచి నాలుగు కేజీల గంజాయి, రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రెండు కేసుల్లో పట్టుబడిన గంజాయి సుమారు రూ.2.5లక్షల వరకు ఉంటుందన్నారు. నిందితులను నందిగామ కోర్టుకు హాజరుపర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో నందిగామ రూరల్ సర్కిల్ సీఐ డీ చవాన్, నందిగామ సీఐ వైవిఎల్ నాయుడు, కంచికచర్ల, వీరులపాడు ఎస్‌ఐలు రాజు, అనిల్‌కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment