వాసవిలో జేఈఈ మెయిన్స్‌కు 301 మంది హాజరు
పెడన: జేఈఈ మెయిన్స్ పరీక్షలు మూడో రోజు పెడన మండల పరిధిలోని నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో శుక్రవారం 301 మంది హాజరయ్యారని కేంద్రం అడ్మిన్ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 164 మందికి 162 మంది హాజరయ్యారని, ఇద్దరు ఆబ్సెంట్ అయ్యారన్నారు. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన పరీక్షకు 142 మందికి 139 మంది హాజరవ్వగా ముగ్గురు హాజరుకాలేదని పేర్కొన్నారు. మొత్తం 306 మందికి గాను 301 మంది పరీక్షకు హాజరవ్వగా ఐదుగురు హాజరుకాలేదన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆయన తెలిపారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు
గన్నవరం: దావోస్ పర్యటన పూర్తి చేసుకుని శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలువురు మంత్రులు స్వాగతం పలికారు. తొలుత ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాఫ్టర్‌లో ఉండవల్లి బయలుదేరి వెళ్లారు.
టౌన్‌ప్లానింగ్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
పటమట(విజయవాడతూర్పు): పట్టణ ప్రణాళిక విభాగం పనితీరులో కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళిక సిబ్బంది మార్పును స్వీకరించి, విభాగం గౌరవాన్ని మరింత పెంచడానికి కృషి చేయాలని గ్రామీణ, పట్టణ ప్రణాళిక శాఖ డైరెక్టర్ విద్యుర్లత అన్నారు. ఏపీ పట్టణ ప్రణాళిక ఉద్యోగస్తుల సంఘం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ శుక్రవారం నగరంలో జరిగింది. కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ అదనపు డైరెక్టర్ బి. శ్రీనివాసులు, డెప్యూటీ డైరెక్టర్లు కె.వి.రంగరాజు, కె.హరిదాసు, ఏపీ పట్టణ ప్రణాళిక ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ పి. మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment