ఆపన్నహస్తం.. రెడ్‌క్రాస్
గుడ్లవల్లేరు: ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ. బెడ్ మీద చావుబతుకుల్లో ఉన్న క్షతగాత్రులతో పాటు శస్త్ర చికిత్సల్లో ఉన్న ఎంతోమందికి రక్తదానం అందించి సేవా తత్పరతను చాటుకుంటోంది. కేవలం ప్రభుత్వం నిర్దేశించిన ప్రొసెసింగ్ చార్జీలతోనే ఇక్కడ ఆపదలో ఉన్నవారికి అవసరమైన రక్తాన్ని అందిస్తారు. కృష్ణా జిల్లాలో రెడ్‌క్రాస్‌తో పాటు మచిలీపట్నం జిల్లా ఆస్పత్రి, గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో బ్లడ్‌బ్యాంకులు ఉన్నాయి.
ఆపదలో బాధితులకు అండగా...
ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలకు దెబ్బ తిన్న బాధితులకు తక్షణ సాయం అందించడానికి రెడ్‌క్రాస్ ముందంజలో ఉంది. ఏటా 20 నుంచి 30వరకు ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా పేదలకు ఉచిత మందుల పంపిణీని చేస్తున్నారు. అన్ని వైద్యాలతోపాటు కంటి పరీక్షలు చేసి రెండేళ్లలో 400 కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండేళ్లలో 50 రక్తదాన శిబిరాలు, 25ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ రెడ్‌క్రాస్‌లో ఉన్నాయి. వాటిని రోగుల సహాయార్థం అందిస్తారు. వికలాంగులకు వీల్‌చైర్లు, రెండేళ్లలో 250మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా రక్తాన్ని అందించడం, జిల్లాలో 500మంది నిరుపేదలకు దుప్పట్లు, మురికి వాడల్లో నివసించే పేదలకు 600 కిట్ల పంపిణీ, 800 మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నారు.
రక్తదాతకూ ఆరోగ్యమే..
ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తం దానం చేస్తే శరీరంలో కొత్త రక్తం వచ్చి ఆరోగ్యంగా ఉంటారు. దాతలు ఇచ్చిన రక్తాన్ని జాగ్రత్తగా భద్రపరచి ఆపదలో ఉన్న వారికి అందజేస్తాం. రెడ్‌క్రాస్ ఎంతోమంది ప్రాణాలను ఇలా కాపాడింది.
– డాక్టర్ టి.ఎస్.ఎస్.బాలాజీ, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్
సేవ చేయడం అలవర్చుకోవాలి
ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం రెడ్‌క్రాస్. అగ్ని ప్రమాదాలు, వైపరీత్యాల్లో బాధితులకు తక్షణ సాయం మా సంస్థ ద్వారా అందుతుంది. సేవా కార్యక్రమాలను చిన్నప్పట్నించే అలవరచుకోవాలి. సమాజంలో యువత కూడా యూత్ రెడ్‌క్రాస్‌లో చేరి తమవంతు సాయాన్ని సొసైటీకి అందించాలి.
– భవిరి శంకర్‌నాథ్, జిల్లా రెడ్‌క్రాస్ సెక్రటరీ
చావుబతుకుల్లో ఎంతోమందికి రక్తదానం
వైపరీత్యాల్లో బాధితులకు భరోసా
చావుబతుకుల్లో
ఎంతోమందికి రక్తదానం
వైపరీత్యాల్లో బాధితులకు భరోసా
ఇచ్చిన రక్తం యూనిట్లలో వివరాలు ఇవి...
2020 741
2021 830
2022 1,176
2023 1,190
2024 1,213
Comments
Please login to add a commentAdd a comment