సెపక్‌తక్రా టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌కు ఆంధ్రా జట్లు
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) 68వ జాతీయ అండర్ – 14 సెపక్‌తక్రా బాల, బాలికల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్లు సత్తా చాటుతున్నాయి. ఈ నెల 24న పటమట జెడ్పీ స్కూల్‌లో ప్రారంభమైన టోర్నీ.. లీగ్ పోటీలు శనివారం ముగిశాయి. 12 రాష్ట్రాల జట్లు పోటీల్లో తలపడుతున్నాయి. పూల్ – బీ నుంచి బరిలో దిగిన రాష్ట్ర బాలికల జట్టు అదే పూల్‌లోని విద్యాభారతి, బిహార్ జట్లను ఓడించి గరిష్టంగా ఎనిమిది పాయింట్లతో పూల్ విన్నర్‌గా నిలిచి క్వార్టర్స్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. అదేవిధంగా నాలుగు పాయింట్లతో పూల్ – సీ రన్నర్‌గా నిలిచిన రాష్ట్ర బాలుర జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
హోరాహోరీగా..
శనివారం జరిగిన లీగ్ పోటీల్లో జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బాలుర విభాగంలో గుజరాత్ 15–12, 15–11 పాయింట్ల తేడాతో బిహార్‌ను, ఢిల్లీ 15–7,15–13 తేడాతో జార్ఖండ్‌ను, ఆంధ్రప్రదేశ్ జట్టు 15–7, 15–9 పాయింట్స్ తేడాతో మహారాష్ట్రను ఓడించాయి. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ 15–7, 15–4 పాయింట్స్ తేడాతో బిహార్‌ను, మణిపూర్ 15–4, 15–2 తేడాతో జార్ఖండ్‌ను, గుజరాత్ 13–15, 11–15 తేడాతో మహారాష్ట్రను ఓడించాయి. తుదకు బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్, మణిపూర్, బిహార్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ జట్లు, బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మణిపూర్, పంజాబ్, తమిళనాడు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి క్వార్టర్స్ ఫైనల్స్ పోటీలు ప్రారంభమవుతాయని స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు, సహాయ కార్యదర్శులు రాధాకృష్ణ, రాజు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.రమేష్ తెలిపారు.
హోరాహోరీగా తలపడతున్న క్రీడాకారులు
Comments
Please login to add a commentAdd a comment