పెనమలూరు: తాడిగడపకు చెందిన విశ్రాంత బ్యాంక్ మేనేజర్ వద్ద సైబర్ నేరగాళ్లు రూ 78.33 లక్షల సొమ్ము స్వాహా చేశారు. పెనమలూరు సీఐ జె.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప పద్మజానగర్ విజయలక్ష్మి రెసిడెన్సీలో బ్యాంక్ విశ్రాంత మేనేజర్ తల్లం ఉమామహేశ్వరగుప్తా కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఆయనకు కొన్నేళ్లుగా షేర్ మార్కుట్‌లో అనుభవం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఎస్ సెక్యూరిటీకి సంబంధించి పి 302 వైఎస్‌ఐఎల్ ఆఫిషెల్‌స్టాక్ ఎకై ్సంజ్ కమ్యూనిటీ నుంచి వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. ఉమామహేశ్వరగుప్తా ప్రమేయం లేకుండానే గ్రూప్‌లో సభ్యుడిగా చేర్చారు. దీనిలో ఏడుగురు సభ్యులు ఉండగా, గ్రూప్‌కు ఎస్‌ఈబీఐ ఇచ్చినట్లుగా సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కంపెనీ కాపీ కూడా షేర్ చేశారు. దీంతో ఉమామహేశ్వరగుప్తా వారిని నమ్మి గత ఏడాది సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ప్రైమరీ మార్కెట్‌లో 9 సార్లుగా రూ.78.33 లక్షలు డిపాజిట్ చేశాడు. షేర్‌లో అమ్మగా ఆయనకు రూ.86.57 లక్షలు లాభం చూపించారు. దీంతో వచ్చిన లాభంలో రూ.20 లక్షలు విత్ డ్రా చేయడానికి యత్నించగా గ్రూప్ నుంచి ఎటుంవటి సమాధనం రాలేదు. దీంతో తాను మోసపోయాననని బాధితుడు గత అక్టోబర్ 23వ తేదీన సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం పెనమలూరు పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో 11 మద్యం దుకాణాలను గీత కార్మికుల ఉప కులాలకు కేటాయించేందుకు కలెక్టరేట్‌లో శుక్రవారం లాటరీ నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ గీత కార్మికుల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో డ్రా నిర్వహించారు. దీనికి 27న నోటిఫికేషన్ ఇస్తారని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment