విద్యార్థులతో కలిసి భోజనం..
కోడూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. శుక్రవారం కలెక్టర్ ఉల్లిపాలెంలోని ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. తరగతుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. చదువులో విద్యార్థులకున్న సామర్థ్యాన్ని తెలుసుకొనే పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం పాఠశాల ఆవరణను తనిఖీ చేసి సంతృప్తి వేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఎంఈఓలు టి.వి.ఎం.రామదాసు, శ్రీనివాసరావు, హెచ్‌ఎం నీరాజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment